జయ్ న్యూస్, భీమ్ గల్: భీమ్ గల్ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో సంతోష్ కుమార్ ఉపాధి హామీ పనులపై ఉపాధి హామీ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉపాధి హామీ కూలీలకు ఈ కేవైసీ వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఉపాధి హామీ పథకంలో భాగంగా బేస్మెంట్ మరియు పైకప్పు లెవెల్ పేమెంట్లు మరియు వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మాణానికి పేమెంట్లు వెంటనే ప్రారంభించాలని తెలిపారు. నర్సరీ మరియు వన మహోత్సవం నిర్వహణ క్రమం తప్పకుండా చేపట్టాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఏపీవో జీ నర్సయ్య ఇంజనీరింగ్ కన్సల్టెంట్ పూర్ణచంద్ టెక్నికల్ అసిస్టెంట్లు ఫీల్డ్ అసిస్టెంట్లు మరియు సీనియర్ మెట్లు మహిళలు తదితరులు పాల్గొన్నారు.
