జయ్ న్యూస్, ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలోని మహాలక్ష్మి కాలనీలో శ్రీ వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా MJ హాస్పిటల్ అధినేత డాక్టర్ మధు శేఖర్, DSO నాగరాజ్, ఆశ హాస్పిటల్ అధినేత డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు జనరల్ వార్డు, ICU లకు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం Dr ప్రియాంక MBBS, MD జనరల్ మెడిసిన్ డాక్టర్ మధు శేఖర్ కు బీపీ పరీక్షలు నిర్వహించారు. ఆస్పత్రి వైద్యులు DR TAMSHA RAJ KUMAR, DR PRIYANKA లు ముఖ్య అతిథులను శాలువాతో ఘనంగా సన్మానించడం జరిగింది. ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడం కోసం ఆసుపత్రిని అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు. ముఖ్యంగా ప్రజలు శ్వాసకోశ ఇబ్బందులకు గురైతే తమను సంప్రదించాలని సూచించారు. అది తక్కువ ధరలో కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తామన్నారు. పట్టణ పరిసర ప్రాంతాల ప్రజలు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆసుపత్రి సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.


ఈ కార్యక్రమంలో వివిధ ఆసుపత్రుల వైద్యులు, యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు కొక్కెర భూమన్న, ముత్తెన్న, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
