జయ్ న్యూస్, ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలోని ఎం ఆర్ గార్డెన్ లో గురువారం రోజు వేల్పూర్ మండలం పడగల్ ఒడ్డెర కాలనీలో గల ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్న అంబుజారాణి ఉద్యోగ విరమణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, వివిధ పాఠశాలలలో వారితో కలసి పనిచేసిన సందర్భాలను నెమరు వేశారు. ఆమెతో కలిసి పనిచేసిన రోజులను గుర్తు చేశారు. ER ఫౌండేషన్ చైర్మన్ ఈరవత్రి రాజశేఖర్ విచ్చేసి పూలమాలలు వేసి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఆయన మాట్లాడుతూ ఆమె ఉపాధ్యాయురాలిగా ఉంటూ ఎంతో మంది విద్యార్థులను గొప్పస్థాయికి తీర్చిదిద్దారని కొనియాడారు. శ్రేయోభిలాషులు మాట్లాడుతూ ఆమె వారి శేష జీవితంలో ఆయువు ఆరోగ్యంతో, సుఖ సంతోషాలతో జీవించాలని కోరారు. ఆర్మూర్ MEO రాజగంగారం, ఆలూరు MEO నరేందర్, పిఆర్టియు జిల్లా, మండల స్థాయి నాయకులు, ఉపాధ్యాయులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పాల్గొన్నారు.
