జయ్ న్యూస్, జక్రాన్ పల్లి: జక్రాన్ పల్లి మండలం కలిగోట్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థులు 2012-2013 ఎస్ఎస్సి బ్యాచ్ ) “కీ.శే” మార్గం లావణ్య జ్ఞాపకార్థం పాఠశాలకు జిరాక్స్ -ప్రింటర్ సెట్ ను ప్రధానోపాధ్యాయులు పురుషోత్తమ చారికి అందజేశారు. ఆయన మాట్లాడుతూ పూర్వ విద్యార్థులు మిద్దె నవీన్, మోహిత్, భీమ్, సవిత, సాయి సుధా, తస్లీమ్, షఫీ, రఫిక్, ప్రవీణ్, రంజిత్, జలంధర్, మినిష్, సంతు, షాహీన్, ఆఫియా తదితరులు అందరు కలిసి పాఠశాల విద్యాభివృద్ధికి తమవంతు సహకారంతో 23000 వెచ్చించి జిరాక్స్ ప్రింటర్ సెట్ సామాగ్రి అందజేశారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు పురుషోత్తమ చారి తెలిపారు. పూర్వ విద్యార్థులు కూడా తమ వంతుగా తాము చదువుకున్న పాఠశాల అభివృద్ధికి సాయం అందించడంలో ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం, పూర్వ విద్యార్థులు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్ పర్సన్, సభ్యులు, గ్రామ అభివృద్ధి కమిటీ పెద్దలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
