జయ్ న్యూస్, ఆర్మూర్: ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో గల 8వ వార్డులో హిందూ సేన యూత్ అధ్యక్షుడు అరుణ్ తన 150 మంది అనుచరులతో బైక్ ర్యాలీతో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డికి స్వాగతం పలికారు. అనంతరం ఆయన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సమక్షంలో 150 మందితో కలిసి బీజేపీ పార్టీలో చేరారు. వీరికి ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అరుణ్ మాట్లాడుతూ బీజేపీ సిద్ధాంతాలు నచ్చి మోదీ అభివృద్ధి చూసి పార్టీలో చేరడం జరిగిందని తెలిపారు. ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మాట్లాడుతూ ఎంపీ అరవింద్ సమక్షంలో జిల్లాలో అన్ని మున్సిపాలిటీలు గెలుస్తాం అని, స్థానిక ఎన్నికలు గెలుపు పక్క అని బీజేపీ ఆర్మూర్ లో జెండా ఎగురవేస్తాం అని అత్యధిక కౌన్సిలర్ స్థానాలు గెలవడం పక్కా అని అన్నారు. అతి త్వరలో ఇతర పార్టీల నుండి బీజేపీలో చేరికలు ఉంటాయని నియోజకవర్గంలో ఉన్న బీజేపీ కార్యకర్తల అందరితో కలిసి భారీ సభ ఏర్పాటు చేసుకుంటామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ అధ్యక్షుడు మందుల బాలు, పోల్కం వేణు, జెస్సు అనిల్, పెద్దోళ్ల గంగారెడ్డి, కలిగోట్ గంగాధర్, మధు, శ్రీనివాస్, రాజు తదితరులు పాల్గొన్నారు.
