జయ్ న్యూస్, ఆలూర్: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో BJP విజయానికి కృషి చేయాలని MP ధర్మపురి అరవింద్ సూచించారు. మచ్చర్ల గ్రామానికి ఆయన వెళ్తుండగా మార్గమధ్యలో ఆలూరు మండలం దేగాం గ్రామంలో కాసేపు ఆగారు. రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలోBJP నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ BJP OBC మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బండారి యాదగిరి, తదితరులు ఉన్నారు.
