జయ్ న్యూస్, ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలో శనివారం ట్రస్మా నిజామాబాద్ ఆధ్వర్యంలో శ్రీ భాషిత పాఠశాలలో తెలంగాణ ఉన్నత విద్యా మండలి వారి “ఇంగ్లీష్ ఆల్గోరిథం” పై ఉపాధ్యాయులకు శిక్షణ శిబిరం ఏర్పాటు చేశారు. “ఇంగ్లీష్ అలిగరిథం” పుస్తకం యొక్క ఉపయోగాలు విధానాన్ని, పాఠశాల ప్రిన్సిపాల్ ప్రతిమ చావ్ల, ఉపాద్యాయినీ ఉపాధ్యాయులకు చక్కగా వివరించారు. వివరాలకు తెలంగాణ ఉన్నత విద్యామండలి వారి website కి వెళ్లి ఉచితంగా pdf కాపీని download చేసుకోవాల్సిందిగా ఆమె సూచించారు. ఈ శిక్షణ శిబిరం అనంతరం శ్రీ భాషిత పాఠశాల కరస్పాండెంట్ మరియు నిజామాబాద్ జిల్లా ట్రస్మా అధ్యక్షుడు పోలపల్లి సుందర్ మాట్లాడుతూ ఉపాధ్యాయులకు, విద్యార్థులకు మరియు ఉద్యోగస్తులకు అవసరమయ్యే స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకొనేందుకు కోసం ఇంగ్లీష్ ఆల్గోరిథం అనే చక్కని పుస్తకాన్ని తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్, ప్రొ. బాలకిష్ట రెడ్డి ఆధ్వర్యంలో చాలా అద్భుతంగా తయారు చేశారు. ముఖ్యంగా గ్రామీణ, ప్రజలు మరియు విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని తయారుచేసిన ఈ పుస్తకం వారికి చాలా చక్కగా ఉపయోగపడుతుందని చెప్పారు. ఆ పుస్తకంతో పాటు టీచర్ హ్యాండ్ బుక్ మరియు వర్క్ బుక్ టీచర్ కి చాలా ఉపయోగపడుతుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశయాల మేరకు విద్యా, వైద్యంలో ఆయన చూపిస్తున్న గొప్ప చొరవకు నిదర్శనంగా తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొ. బాలకిష్టారెడ్డి మరియు వారి టీమ్ ఎన్నో అంశాల పైన చేస్తున్న కార్యక్రమాలు ఆదర్శనీయమని అందులో ఇలాంటి పుస్తకావిష్కరణ ఒక అద్భుత ఆవిష్కరణ అని, ఇలాంటి బృహత్తర కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్న తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొ. బాలకిష్ట రెడ్డి మరియు వారి సహచర బృందానికి ప్రత్యేక అభినందనలు మరియు ధన్యవాదములు తెలిపారు. తెలంగాణ రికాగ్నైజ్డ్ స్కూల్స్ మానేజ్మెంట్ అసోసియేషన్ (ట్రస్మా) ప్రెసిడెంట్ సాదుల మధుసూదన్, ప్రధాన కార్యదర్శి శ్రీ రమేష్ రావు మరియు కోశాధికారి, శ్రీ రాఘవేంద్ర రెడ్డిల ఆదేశాల మేరకు ఇట్టి కార్యశాలలు నిర్వహిస్తున్నట్లు సుందర్ తెలిపారు. ఇంకా రాష్ట్రవ్యాప్తంగా ఇట్టి కార్యక్రమాలను అన్ని ప్రైవేట్ స్కూళ్లల్లో నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్, ప్రిన్సిపల్, asst.ప్రిన్సిపాల్ ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
