జయ్ న్యూస్, డోంకేశ్వర్: ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి ప్రత్యేక చొరవతో మంజూరు అయినా CRR నిధులు 10 లక్షల రూపాయలతో డొంకేశ్వర్ మండలం అన్నారం గ్రామంలో సీసీ రోడ్డు పనులను కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డొంకేశ్వర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భూమేష్ రెడ్డి, మండల కాంగ్రెస్ బీసీ సెల్ అధ్యక్షులు గణేష్ గౌడ్, సుద్ద చిన్నయ్య, రాజు, మున్నా లు పాల్గొన్నారు.
