జయ్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఖిల్లా మినీ ట్యాంక్ బండ్ ఆటో స్టాండ్ వద్ద UTUC అనుబంధ శ్రామిక్ ఆటో యూనియన్ నిజామాబాద్ స్టికర్ లను ఆటో కార్మికులకు అందజేశారు.ఈ సందర్భంగా RSP నగర కన్వీనర్ కటారి రాములు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం (మహాలక్ష్మి) ఉచిత బస్సు పథకం అమలు చేయడంతో ఆటో కార్మికుల జీవితాలు రోడ్డున పడ్డాయని అన్నారు. అదేవిధంగా ఆటో కార్మికులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం సంవత్సరానికి 12000 జీవనభృతి అందించి వారికి ఇన్సూరెన్స్ మరియు ఫిట్నెస్ ప్రభుత్వమే కల్పించాలని అన్నారు. ఆటో కార్మికుల శ్రమ తెలంగాణ రాష్ట్రంలో ఎంతో కీలకంగా ఉందని ఆర్టీసీ బస్సులు వెళ్లలేని మారుమూల ప్రాంతాలలో కూడా ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కల్పిస్తూ ప్రజల దైనందిన కార్యకలాపాలు ఆటకం లేకుండా సరైన సమయంలో చేర్చి తమ జీవనం కొనసాగిస్తున్న ఆటో కార్మికులకు డబుల్ బెడ్ రూములు అందించి వారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు గోపాల్ సింగ్ ఠాగూర్, సునీల్,
సయ్యద్ రఫీ ఉద్దీన్, సయ్యద్ ఇర్ఫాన్, ఎస్.కె ముజ్జు, సయ్యద్ ఖలీముద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
