జయ్ న్యూస్, ఆలూర్: ఆలూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్ని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మేకల గోవిందు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయనను సొసైటీ వైస్ చైర్మన్ ch రాజేశ్వర్, రాష్ట్ర ఎస్సీ సెల్ కన్వీనర్, సొసైటీ డైరెక్టర్ దేగాం ప్రమోద్, సీఈఓ మల్లేష్ తదితరులు కలిసి సన్మానించారు. సొసైటీ పరిధిలో ధాన్యం కొనుగోలు ఏ విధంగా జరుగుతుందో వారిని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. AO రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
