జయ్ న్యూస్, ఆర్మూర్: మోర్తాడ్ మండలం పాలెం గ్రామానికి చెందిన అంకుష్’ ఇటీవల జరిగిన CA రాత పరీక్షలో విజయం సాధించాడు. ఆర్మూర్ పట్టణం శ్రీరామ కాలనీలో గల CA కార్యాలయంలో మంగళవారం ER ఫౌండేషన్ చైర్మన్, ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ ఈరవత్రి రాజశేఖర్ ని కలుసుకొని ఆయన దీవెనలు, సలహాలు తీసుకున్నాడు. ఈ సందర్భంగా అంకుష్ మాట్లాడుతూ తన విజయానికి CA .రాజశేఖర్ ని స్ఫూర్తిగా తీసుకొని, ఆయన చెప్పిన మెలకువలు సలహాలు సూచనలు పాటించి కష్టపడి CAలో ఉత్తీర్ణత సాధించారన్నారు. ఈ సందర్భంగా ఈరవత్రి రాజశేఖర్ అంకుష్ ను అభినందించి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు కుండ రాంప్రసాద్, లీడర్ ఫ్యాషన్స్ శ్రీనివాస్, తదితరులు ఉన్నారు.
