జయ్ న్యూస్, ఆర్మూర్: క్షత్రియ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, ఆర్మూర్కి చెందిన NCC క్యాడెట్లు “Say No to Drugs, Say Yes to Sports” అనే కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని పోలీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంలో మా క్యాడెట్లు అత్యుత్తమ ఉత్సాహం, క్రమశిక్షణ ప్రదర్శించడంతో, పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య చేతుల మీదుగా “Best Performance Award” అందుకున్నారు. ఈ అవార్డు కార్యక్రమానికి ACP రాజ వెంకట్ రెడ్డి మరియు CI సత్యనారాయణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అలాగే మా NCC క్యాడెట్లు గార్డ్ ఆఫ్ హానర్ (Guard of Honour) ప్రదర్శనతో అందరి ప్రశంసలు అందుకున్నారు. ఈ సందర్భంగా కళాశాల NCC అధికారి శ్రీ బి. బ్రిజేష్ రాజ్ మాట్లాడుతూ –
“మా క్షత్రియ కాలేజ్ NCC క్యాడెట్లు ఎల్లప్పుడూ క్రమశిక్షణ, సేవాభావం, మరియు జాతీయ సమైక్యతకు ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగుతున్నారు. ‘Say No to Drugs, Say Yes to Sports’ కార్యక్రమంలో వారు చూపిన క్రమశిక్షణ, సమన్వయం, మరియు ఉత్సాహం వారిలోని నిజమైన NCC ఆత్మను ప్రతిబింబించింది” అని తెలిపారు.
అలాగే ఆయన మాట్లాడుతూ, “ఈ అవార్డు క్యాడెట్ల కష్టానికి, పట్టుదలకి, మరియు NCC విలువలపట్ల నిబద్ధతకు నిదర్శనం. మా క్యాడెట్లు సమాజానికి ఆదర్శంగా నిలుస్తూ, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆశిస్తున్నాను” అన్నారు. ఈ సందర్భంగా చరవాణి (ఫోన్) సందేశం ద్వారా కళాశాల చైర్మన్ అల్జాపూర్ శ్రీనివాస్, సెక్రటరీ & కరెస్పాండెంట్ అల్జాపూర్ దేవేందర్, ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కట్కం శ్రీనివాస్, మరియు AO నరేందర్ లు శుభాకాంక్షలు తెలిపారు.
