జయ్ న్యూస్, ఆర్మూర్: ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామంలో రేషన్ దుకాణాన్ని మంగళవారం MLA పైడి రాకేష్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టాక్ వివరాలను, ఎంతమందికి రేషన్ బియ్యం పంపిణీ చేస్తున్నారు?. ఎంతమంది రేషన్ లబ్ధిదారులు ఉన్నారని ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే లబ్ధిదారులతో మాట్లాడారు. బియ్యం సరిగా ఉన్నాయా అని అడిగారు. తినడానికి అనుకూలంగా ఉన్నాయా? ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని ఆరా తీశారు.
