జయ్ న్యూస్, ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలోని ప్రసిద్ధ జంబి హనుమాన్ లోని అయ్యప్ప స్వామి దేవాలయంలో గురు స్వామి నగేష్ శర్మ ఆధ్వర్యంలో భక్తులు అయ్యప్ప మాల ధారణ స్వీకరించారు. గురు స్వామి నగేష్ శర్మ మాట్లాడుతూ ఈరోజు కార్తీక పౌర్ణమి ఎంతో శుభదినము అని అన్నారు. సుమారు 60 మంది భక్తులు అయ్యప్ప మాలధారణ చేశారని తెలిపారు. ప్రతి సంవత్సరం అయ్యప్ప స్వామి భక్తులు పెద్ద ఎత్తున అయ్యప్ప మాల ధారణ చేసుకుంటున్నారని అన్నారు. దీక్షలో ఉన్నప్పుడు అయ్యప్ప స్వాములు ప్రతిరోజు నియమ నిబంధనలు పాటిస్తూ నిత్యం అయ్యప్ప స్వామిని పూజించాలన్నారు. అయ్యప్ప స్వామి కృపతో ప్రజలందరూ చల్లగా ఉండాలని అయ్యప్ప స్వామిని వేడుకున్నామని తెలిపారు.
