జయ్ న్యూస్, హైదరాబాద్: ఇటీవల మాజీ మంత్రి సిద్దిపేట, ఎమ్మెల్యే సీనియర్ నాయకులు తన్నీరు హరీష్ రావు పితృమూర్తి పరమపదించిన సందర్భంగా కీర్తిశేషులు తన్నీరు సత్యనారాయణ దశదినకర్మ గురువారం హైదరాబాద్ లో జరిపారు. ఈ కార్యక్రమానికి ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరవత్రి రాజశేఖర్ పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి BRS సీనియర్ నాయకులు సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావుని కలిసి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు డిష్ రాంప్రసాద్ తదితరులున్నారు.
