జయ్ న్యూస్, ఆలూర్: ఆలూరు మండలం మిర్దాపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థిని N శిరీష , సీనియర్ రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు ఎంపికయింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నిర్వహించిన సీనియర్ ఖోఖో భాగంలో ప్రతిభ చాటి రాష్ట్రస్థాయికి ఎంపికైనట్లు వ్యాయామ ఉపాధ్యాయురాలు సుజాత తెలిపారు. ఈనెల7వ తేదీ నుండి 9వ తేదీ వరకు కరీంనగర్ జిల్లా పెద్దపల్లిలో నిర్వహించే రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలలో పాల్గొంటారని తెలిపారు. N.శిరీష, పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయురాలు సుజాత లను పాఠశాల ప్రధానోపాధ్యాయులు నరేందర్ రావు, పాఠశాల ఉపాధ్యాయ బృందం మరియు గ్రామ అభివృద్ధి కమిటీ వారు అభినందించారు.
