జయ్ న్యూస్, ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళ డిగ్రీ కళాశాలలో అక్టోబర్ మాసంలో మూడు శిక్షణ తరగతులు నిర్వహించడం జరిగిందని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్. ఎస్. చంద్రిక హర్షాన్ని వ్యక్తం చేశారు. ఈ శిక్షణ కార్యక్రమంలో మొదటగా కెరియర్ గైడెన్స్ విభాగం అవగాహన సదస్సును ఉద్దేశిస్తూ హైదరాబాదుకు చెందిన సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ సంయుక్త ఆధ్వర్యంలో చిన్న పరిశ్రమలకు లోన్ ఏవిధంగా తీసుకోవాలని దాన్ని మార్కెటింగ్ నిర్వహణ అంశాలపై అవగాహన కల్పించారు. అలాగే రెండవ అంశంగా మ్యాజిక్ బస్సు ఫౌండేషన్ ఆధ్వర్యంలో సాఫ్ట్ స్కిల్స్ మరియు ఇంటర్వ్యూ ప్రిపరేషన్ పై శిక్షణ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఫైనల్ ఇయర్ విద్యార్థులకు నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగా విద్యార్థులకు సర్టిఫికెట్స్ ను కూడా జారీ చేయడం జరిగింది. మూడవ అంశముగా సోహం అకాడమీ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ ఆధ్వర్యంలో రోబోటిక్స్ ఇన్ అకాడమీ (ఆర్ ఐ ఏ) భౌతిక శాస్త్రం విద్యార్థులకు రోబోటిక్స్ ప్రాథమిక సిద్ధాంతాలు సాంకేతిక పరిజ్ఞానం ప్రాక్టికల్ ప్రాజెక్టులపై పనిచేయడం ద్వారా నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నట్లు తెలిపారు.
