జయ్ న్యూస్, ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలోని ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీశ్రీశ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయానికి పట్టణంలోని రాంనగర్ కాలనీ భక్తులు అడ్ల రేవతి భూమయ్య వారి కుమారులు శ్రీ తేజ్, రోహిత్ ముదిరాజ్ కుటుంబ సభ్యులు ముదిరాజ్ సంఘం కుల పెద్దలు, కుల సభ్యులు పెద్దమ్మ తల్లి ఆలయ కమిటీ చైర్మన్, సభ్యులు వారి ఇంటికి వెళ్లి నూతన ఆలయ నిర్మాణం గురించి చెప్పగానే వారు సానుకూలంగా స్పందించి 8,88,888 రూపాయలు విరాళంగా అందజేశారు. ముదిరాజ్ సంఘం పెద్దలు, సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు వారికి పూలమాలలు వేసి శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో పెద్దమ్మ తల్లి ఆలయ కమిటీ చైర్మన్ మచ్చేందర్, ముదిరాజ్ సంఘం పెద్ద బజారు అధ్యక్షులు బోండ్ల సంతోష్, ముదిరాజ్ సంఘం పెద్ద బజార్, రాజారాం నగర్ కాలనీ కుల పెద్దలు, సభ్యులు, పెద్దమ్మ తల్లి ఆలయ కమిటీ సభ్యులు పోశెట్టి, మోహన్, బాలానంద్, గోపి, రమేష్, బొంబాయి భోజన్న, పెద్ద భోజన్న, నడిపి భోజన్న, మందుల బాలు, గాజం మహేందర్, చిన్న పోశెట్టి, లింగం, శంకర్, సతీష్, గాజం పెద్ద గంగారం తదితరులు పాల్గొన్నారు.
