జయ్ న్యూస్, ఆర్మూర్: కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆర్మూర్ పట్టణం అంబేద్కర్ చౌరస్తాలో శుక్రవారం ఈఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వందేమాతరం గేయానికి 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరవత్రి రాజశేఖర్ మరియు సభ్యులు వందేమాతరం గేయాన్ని ఆలపించి తమ దేశభక్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరవత్రి రాజశేఖర్ మాట్లాడుతూ బంకించంద్ర చటర్జీ, రచించిన వందేమాతరం గేయం స్వాతంత్ర్య ఉద్యమంలో ఆంగ్లేయుల్ని తరిమికొట్టానికి కోట్ల మంది భారతీయులలో స్ఫూర్తిని నింపిందన్నారు. వందేమాతరం గేయం ప్రతి ఒక్క పౌరుని గుండెల్లో చిరస్థాయిగా మిగిలిపోతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో అర్గుల్ నరసయ్య, డిష్ రాంప్రసాద్, నూకల శేఖర్, కొండి రామచందర్, పట్టణ పద్మశాలి అధ్యక్షులు మోహన్ దాస్, సర్వ సమాజ్ సభ్యులు టాటా సాగర్, అనంతరావు, తంబాకు శేఖర్ ,దోమల శ్రీనివాస్, ఓం ట్రేడర్ గంగ మోహన్, ఇస్తాకుద్దిన్, పెంటి ప్రవీణ్, ఉదయ్, మహేందర్ రెడ్డి, టైలర్ వినోద్, రజినిష్, లక్ష్మ మోహన్, బాబురావు, కెవి రమణ, భాస్కర్, ఆనంద్, క్రాంతి తదితరులు పాల్గొన్నారు.
