జయ్ న్యూస్, ఆర్మూర్: PDSU ఆర్మూర్ ఏరియా నూతన కమిటీని పట్టణంలోని ఆల్ ఫోర్స్ జూనియర్ కళాశాలలో పిడిఎస్యూ జిల్లా అధ్యక్షుడు నరేందర్ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.. ఈ సందర్భంగా ఏరియా అధ్యక్షుడు నిఖిల్, ప్రధాన కార్యదర్శి రాజులు మాట్లాడుతూ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పిడిఎస్యు ఆర్మూర్ ఏరియా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం అందులో మాకు మంచి స్థానం కల్పించిన జిల్లా కమిటీకి ప్రత్యేక అభినందనలు తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఇటువంటి కలశం లేకుండా విద్య రంగ సమస్యలు పరిష్కారం ధ్యేయంగా పనిచేస్తామని మాపై ఉంచిన బాధ్యతను సమర్థవంతంగా పూర్తి చేస్తామని వారు అన్నారు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ సమస్యలు పరిష్కరించి తక్షణమే స్కాలర్షిప్ ప్రియంబర్స్ బకాయిలను విడుదల చేయాలని సంక్షేమ వసతి గృహాల్లో ఉన్న సమస్యలు పరిష్కరించి పెండింగ్ మెస్ బకాయిలను విడుదల చేయాలని బెస్ట్ అవైలబుల్ పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని తదితర అంశాలపై తీర్మానాలు చేసుకొని భవిష్యత్ కార్యాచరణని రూపొందించుకున్నామని వారు అన్నారు.. ఈ కార్యక్రమంలో ఏరియా ఉపాధ్యక్షురాలు మమత, సహాయ కార్యదర్శి సిద్ధార్థ,కోశాధికారి నిహారిక ఏరియా నాయకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
