జయ్ న్యూస్, ఆలూర్: “వందేమాతరం” జాతీయ గీతాన్ని మహాకవి బంకిమ్ చంద్ర చటర్జీ రచించి 150 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆలూరు మండల కేంద్రంలో వందేమాతరం గీతాన్ని సామూహికంగా ఆలపించినట్లు MPDO గంగాధర్ తెలిపారు. అధికారులు, సిబ్బంది స్వచ్ఛందంగా పాల్గొని దేశభక్తి భావాన్ని చాటడం అభినందనీయమని ఆయన చెప్పుకొచ్చారు. వందేమాతరం గేయం ప్రతి పౌరుడిలో దేశభక్తి భావాన్ని పెంపొందిస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
