జయ్ న్యూస్, ఆర్మూర్: దేశవ్యాప్తంగా షుమారు 20 రాష్ట్రాల పాఠశాలల నుండి 5000 (ఐదువేల మంది) విద్యార్థులకు నిర్వహించిన “Read India Celebrations-2025” పుస్తక పఠన పోటీల్లో శ్రీ భాషిత పాఠశాల విద్యార్థులు, అలీనా తహరిన్, 9వ తరగతి ఇంగ్లీషులో పఠనం , జునేర తహరిన్ ఏడవ తరగతి హిందీభాషా పుస్తక పఠనంలో మొదటి రౌండ్ లో విశిష్ట ప్రతిభ కనబరిచి జాతీయస్థాయిలో ఎంపిక కావడం జరిగిందని పాఠశాల కరస్పాండెంట్, పొలపల్లి సుందర్ తెలిపారు. పాఠశాల విద్యార్థులు పఠన నైపుణ్యం, వాగ్చాతుర్యం, సృజనాత్మకత ఆలోచనల్లో తమ ప్రతిభను ప్రదర్శించి నవంబర్ 3వ వారంలో జరిగే జాతీయస్థాయి రెండవ రౌండ్ పోటీకి అర్హత సాధించారు. సుమారు ఐదు వేల మంది విద్యార్థుల నుండి 91 మంది విద్యార్థులను రెండవ రౌండ్ కి ఎంపిక చేయడం జరిగింది. ఈ రెండవ రౌండ్ కి ఎంపికైన 91 మంది విద్యార్థుల నుండి నవంబర్ 3వ వారంలో జరిగే రెండవ (ఫైనల్) రౌండ్ లో 5 గురు విజేతలను ప్రకటిస్తారని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్, పోలపల్లి సుందర్ విద్యార్థులను అభినందిస్తూ “శ్రీ భాషిత విద్యార్థులు కేవలం చదువుల్లోనే కాకుండా దేశవ్యాప్త పోటీల్లో ఉన్నారు. అది ఉన్నత బోధన ప్రమాణాలు మరియు ఉపాధ్యాయుల అహర్నిశల శ్రమ ఫలితం ” అని అన్నారు. అంతేకాకుండా Read India celebrations 2025 లో, దేశంలోని 20 రాష్ట్రాల పాఠశాలల 5000 మంది పాల్గొన్న ఈ ప్రతిష్టకరమైన పోటీలో మా పాఠశాల విద్యార్థులు ఎంపిక కావడం మరియు తెలంగాణ రాష్ట్రంలోని ప్రతిష్ఠకరమైన పాఠశాలల వరుసలో మన శ్రీ భాషిత ఉండడం చాలా సంతోషకరంగా ఉంది అని అన్నారు. విద్యార్థుల కృషిని ప్రశంసిస్తూ భవిష్యత్తులో మరిన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయి విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. విద్యార్థుల తల్లిదండ్రులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్, ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.
