జయ్ న్యూస్, ఆర్మూర్: ఆర్మూర్ మండలం చేపూర్ లో క్షత్రియ పాఠశాలలో గ్రాండ్ పెరెంట్స్ డే ను ఎంతో ఘనంగా నిర్వహించినారు. ఈ కార్యక్రమానికి క్షత్రియ విద్యా సంస్థల, కార్యదర్శి అల్జాపూర్ దేవేందర్, కోశాధికారి అల్జాపూర్ గంగాధర్ లు ముఖ్య అతిథులుగా విచ్చేసినారు. స్కూల్ ప్రిన్సిపాల్ లక్ష్మీనరసింహ స్వామి అధ్యక్షతన నిర్వహింపబడిన కార్యక్రమంలో గ్రాండ్ పెరెంట్స్ పొల్గొన్నారు. కార్యక్రమానికి విచ్చేసిన గ్రాండ్ పెరెంట్స్ లు మాట్లాడుతూ జీవితంలోని తమ అనుభవాలను తోటి వారితో పంచుకున్నారు. క్షత్రియ పాఠశాల ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం ద్వారా భావి తరాలకు వృద్ధుల అనుభవాలు ఎంతో ఉపయోగ పడ్తాయని పేర్కొన్నారు. కార్యక్రమానికి విచ్చేసిన అల్జాపూర్ దేవేందర్ మాట్లాడుతు ప్రతి కుటుంబానికి అమ్మమ్మ, నానామ్మ, తాతయ్యల అనుభవాలు ఎంతో ఉపయోగ పడ్తాయని, అందుకే వారిని గౌరవ పూర్వకంగా చూసుకొని, సంతోషంగా ఉంచాలని అన్నారు, కోశాధికారి అల్జాపూర్ గంగాధర్ మాట్లాడుతూ మన కుటుంబంలోని గ్రాండ్ పరెంట్స్ మనకు మూలనిధిలాంటి వారని పేర్కొన్నారు. స్కూల్ ప్రిన్సిపాల్ లక్ష్మీనరసింహ స్వామి మాట్లాడుతూ వృద్దులు తమ కుటుంబం లోని మనుమలు మనుమరాండ్లకు ఉచిత విలువలు, మానవీయ విలువలను తెలియజేస్తూ తీర్చిదిద్దాలని కోరారు. ఈ ఆధునిక యుగంలో చిన్న పిల్లలకు మీ మార్గ దర్శనం ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఇటువంటి సంస్కార వంత మైన కార్యక్రమలు నిర్వహించడానికి క్షత్రియ స్కూల్ ఎల్లప్పుడు సిద్దంగా ఉంటుందని అన్నారు. ఆ తరువాత వచ్చిన గ్రాండ్ పేరెంట్స్ కు చిన్న నాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తూ వివిధ ఆటల పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేసినారు. ఇట్టి కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రాండ్ పెరెంట్స్ పాల్గొన్నారు.
