జయ్ న్యూస్, ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలోని ZPHS (రామ్ మందిర్) పాఠశాలలో 2008-2009 SSC బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకున్నారు. ఎన్నో ఏళ్ల తర్వాత తమ తోటి మిత్రులను కలుసుకోవడం ఆనందంగా ఉందని పూర్వ విద్యార్థులు చెప్పుకోచ్చారు. చిన్ననాటి మధుర జ్ఞాపకాలను పూర్వ విద్యార్థులు నెమరు వేసుకున్నారు. ఒకరు కష్ట సుఖాలను మరొకరు అడిగి తెలుసుకున్నారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువు స్థానం గొప్పదని కొనియాడారు. గురువులను సన్మానించారు.
