జయ్ న్యూస్, ఆర్మూర్: ఆర్మూర్ శివారు అర్గుల్ లో గల ప్రకాష్ హ్యుండాయ్ షోరూంలో సరికొత్త డిజైన్ గల నూతన వెన్యు కార్ ను సోమవారం SBI మెయిన్ బ్రాంచ్ మేనేజర్ కార్తీక్ గౌడ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఈవో ప్రతిహాస్ రెడ్డి మాట్లాడుతూ హ్యుండాయ్ మోటర్ ఇండియా సరికొత్త డిజైన్ తో హ్యుండాయ్ వెన్యు కార్ ను ప్రపంచవ్యాప్తంగా అరంగేట్రం చేయడంతో ముఖ్యమైనా మైలురాయిని సాధించిందని అన్నారు. కాంపాక్ట్ ఎస్.యు.వి విభాగాన్ని గోల్డ్ కొత్త డిజైన్, అధునాతన సాంకేతికతతో కాంపాక్ట్ ఎస్.యు.వి విభాగంలో గేమ్ చేంజర్ అవుతుందని CEO పేర్కొన్నారు. 2030 నాటికి హ్యుండాయ్ లో ప్రవేశపెట్టాలని ప్లాన్ చేస్తున్న 26 ఉత్పత్తులలో మొదటిదన్నారు. కారు యొక్క ప్రారంభ ధర 7,89,900/- రూపాయలు ఉందని, పెట్రోల్ డీజిల్ సౌకర్యం కలదని తెలిపారు. ఈ కార్యక్రమంలో షోరూం మేనేజర్స్ భోజేందర్, సతీష్, షోరూం సిబ్బంది, వినియోగదారులు తదితరులు పాల్గొన్నారు.
