జయ్ న్యూస్, ఆర్మూర్: భారత తొలి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని ఆర్మూర్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నెహ్రు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ దేశంలో విద్య ప్రమాణాలను పెంచాలనే లక్ష్యంతో నెహ్రు ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని తెలిపారు. నెహ్రూ ఆశయ సాధన కోసం కృషి చేద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో AMC చైర్మన్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు సాయిబాబా గౌడ్, సీనియర్ నాయకులు వెంకట్రాంరెడ్డి, జిమ్మీ రవి, మాజీ కౌన్సిలర్లు తాటి హనుమాన్లు, సడక్ వినోద్, యువజన కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు విజయ్ అగర్వాల్, డీసీసీబీ డైరెక్టర్ వాసు, హరీష్, భూపేందర్, అభినవ్, శ్రావణ్, సాయి తదితరులు పాల్గొన్నారు.
