జయ్ న్యూస్, ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలోని సిద్ధుల గుట్టపై ఉన్న ప్రసిద్ధ అయ్యప్ప స్వామి క్షేత్రంలో నేటి నుండి అయ్యప్ప స్వాములకు నిత్య అన్నసత్రం ప్రారంభిస్తున్నామని అయ్యప్ప స్వామి ఆలయ ధర్మకర్త, తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ వన్నెల్ దేవి లావణ్య అయ్యప్ప శ్రీనివాస్ తెలిపారు. నవంబర్ 16 తేదీ నుండి డిసెంబర్ 26 తేదీ వరకు అయ్యప్ప స్వాములకు ఆలయంలో నిత్య అన్న సత్రం నిర్వహిస్తున్నామని అయ్యప్ప స్వాములు పెద్ద ఎత్తున విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.
