జయ్ న్యూస్, ఆర్మూర్: మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల్లో మక్కలు విక్రయించిన రైతులకు ప్రభుత్వం వెంటనే డబ్బులను వారి ఖాతాలలో జమ చేయాలని బిఆర్ఎస్ సీనియర్ నాయకులు, మాజీ వైస్ ఎంపీపీ గంగాధర్ డిమాండ్ చేశారు. ఆర్మూర్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. కొనుగోలు కేంద్రాల్లో మొక్కజొన్నలను కొనుగోలు చేసి నెల రోజులు గడుస్తున్న రైతులకు డబ్బులు అందలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మొక్కజొన్నలు విక్రయించిన డబ్బులు వస్తే రైతులకు ఎంతో ఆసరాగా ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని వెంటనే మక్కల డబ్బులు రైతుల ఖాతాలో జమ చేయాలని కోరారు. అలాగే రైతుబంధు వెంటనే ఇవ్వాలని, సన్నరకం వడ్లకు క్వింటాలుకు బోనస్ 500 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.
