
నిజామాబాద్ జిల్లా డొంకేశ్వర్ మండలం చిన్నాయనం గ్రామ శివారులోని ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ లో మత్స్యకారులకు భారీ చేప చిక్కింది.
ఉదయం ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ లో చేపలు పట్టడానికి వెళ్ళిన మత్స్యకారులు వేసిన వలలో 34 కిలోల బొచ్చ చేప లభించినట్లు వారు వెల్లడించారు.
ప్రతి సంవత్సరం భారీ చేపలు తమ వలలో పడుతుంటే కానీ ఈ సంవత్సరం భారీ చేప తమకు చిక్కడంతో మత్స్యకారులు సంతోషం వ్యక్తం చేశారు.