
ఆర్మూర్ మున్సిపల్ పరిధి పెర్కిట్ లో గల ఆనందు మల్టీస్పెషల్టి ఆసుపత్రిలో ఉచిత మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగిందని డాక్టర్ అరుణ్ రెడ్డి తెలిపారు.
ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉచిత క్యాంపు నిర్వహిస్తున్నామని డివిజన్ నుండి ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారని, వచ్చిన వారికి పలు ఆరోగ్య పరీక్ష నిర్వహించామని తెలిపారు.
హెల్త్ క్యాంపులో భాగంగా స్త్రీ వైద్య సమస్యలు, చిన్నపిల్లల సమస్యలు, బీపీ షుగర్, విష జ్వరాలు, దీర్ఘకాలిక జ్వరాలు, నరాలు, కీళ్ల ఎముకల నొప్పులకు పరీక్షలు నిర్వహించామని తెలిపారు. మహిళలకు ప్రత్యేకంగా డాక్టర్ పూజా రెడ్డి ఆరోగ్య పరిక్షలు నిర్వహించారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వైద్యులు షరిక్, ధీరజ్ కుమార్, ఆసుపత్రి వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.