
నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం కొండూరు గ్రామంలోని శివాలయంలో ఈరోజు అమ్మ పాటే జోల పాట అమృతానికన్న తీయనంట అని గత సంవత్సరం పాడిన అమ్మ పాట గాయని ఆర్ జాహ్నవి నీ సిరికొండ మండల కొండూరు పద్మశాలి సంఘం సభ్యులు ఘనంగా సన్మానించారు. అనంతరం గాయని మాట్లాడుతూ.. గత సంవత్సరం పాట పాడాను… కెమెరామెన్ తిరుపతి, రచన మిట్టపల్లి సురేందర్, వీరా ఆధ్వర్యంలో పాట పాడాననీ ఆమె తెలిపారు. ఈ సన్మాన కార్యక్రమంలో మహిళలు, సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.