
ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని అర్బన్ హెల్త్ సెంటర్లో సోమవారం నర్సుల దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ రమేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తమ సేవలు అందిస్తున్న నర్సులను ప్రశంసించారు. రానున్న రోజుల్లోనూ వైద్య సిబ్బంది రోగులకు, ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల మన్ననలు అందుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శిరీష, సబ్ యూనిట్ అధికారి సాయి, హెల్త్ అసిస్టెంట్ ఆనంద్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.