
ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆదేశాల మేరకు ఆలూర్ మండల కేంద్రంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ విజయభారతి చేతుల మీదుగా లబ్ధిదారులకు పంపిణీ చేశారు. సుమారు 7 లక్షల రూపాయల చెక్కులను 40 మంది లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగిందని మండల అధ్యక్షులు సూర శ్రీకాంత్ తెలిపారు. చెక్కుల మంజూరుకు కృషి చేసిన ఎమ్మెల్యేకు లబ్ధిదారులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులు మల్లయ్య, మాజీ మండల అధ్యక్షులు గిరీష్, మండల కార్యదర్శి హరీష్, డాక్టర్ అరుణ్, సురేష్ గౌడ్, నితిన్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.