
ఆర్మూర్ పట్టణ గ్రంథాలయంలో జాతీయ అవార్డు గ్రహీత, సామాజిక సేవకులు పట్వారీ తులసి కుమార్ అధ్వర్యంలో మత్తు పదార్థాల వల్ల కలిగే నష్టాలు పోస్టర్స్ చేత అవగాహన కల్పిస్తూ మరియు యువత ఉన్నత గమ్యాన్ని చేరుకునే పద్ధతిపై కార్యక్రమాన్ని ముఖ్య అతిథి ఆర్మూర్ పట్టణ సిఐ సత్యనారాయణ గౌడ్ వారిచే అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మత్తు పదార్థాలు గంజాయి, గుట్కా, మద్యపానం, ధూమపానం వల్ల కలిగే దుష్ఫలతాలను వివరించి వాటికి యువత దూరంగా ఉండి గురువులు, తల్లిదండ్రులు నేర్పిన అంశాలతో ముందుకు వెళ్లి ఉన్నత లక్ష్యాలను సాధించాలని కోరారు. ప్రతి ఒక్కరూ తమకు ఇష్టమైన రంగంలో ఉన్నత స్థానంలో నిలవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పట్వారీ తులసి యువతకు, సమాజ శ్రేయస్సు కోసం తనవంతు చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు.. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామీణ ప్రాంత వాసి విద్యార్థులు యువత, ప్రజలు, గ్రంథాలయ ఇన్చార్జి వరలక్ష్మి, పోలీస్ శాఖ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.