నిజామాబాద్ రూరల్ సిరికొండ మండల కేంద్రంలో మద్యం త్రాగి వాహనాలు నడిపిన 7గురు వ్యక్తులకు రెండు రోజుల జైలు శిక్ష ఆర్మూర్ సెకండ్ మెజిస్ట్రేట్ ఈరోజు విధించారని ఎస్ఐ ఎల్ రామ్ తెలిపారు. ఆ ఏడుగురు వ్యక్తులు కొండూర్, గడ్కోల్, పెద్ద వాల్గోట్, మరిమడ్ల, సీతాయిపేట్ గ్రామాలకు చెందిన వారిగా గుర్తించారు.మండల కేంద్రంలో బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించిన, మద్యం సేవించి వాహనాలు నడిపిన, మైనర్ పిల్లలకు వాహనాలు ఇచ్చిన, కఠిన చర్యలు తప్పవని ఎస్సై రామ్ హెచ్చరించారు.