విద్యావంతుడు ప్రజా ప్రతినిధి అయితే ప్రజలకు మేలు జరుగుతుందని, అదేవిధంగా జర్నలిస్టులు సమాజంలో నున్న చెడును వెలికి తీసి ప్రభుత్వం దృష్టికి తీసుకొని రావాలని ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్, చార్టెడ్ అకౌంటెంట్ ఈరవత్రి రాజశేఖర్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ భవనంలో మంగళవారం నవనాథపురం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మంచిర్యాల నరేందర్ అధ్యక్షతన ఈ ఆర్ ఫౌండేషన్ చైర్మన్ రాజశేఖర్ అభినందన సభ జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొని ఆయన మాట్లాడుతూ ఎలాంటి లాభాపేక్ష లేకుండా జర్నలిస్టులు సేవా దృక్పథంతో చెడును వెలికి తీసి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నారన్నారు. స్థాయిని మించి జర్నలిస్టులు రాత్రింబవళ్లు పనిచేస్తారన్నారు జర్నలిస్టులను రాజకీయ నాయకులు తమ అవసరాలకు వాడుకొని ఆ తర్వాత పట్టించుకోరనీ విమర్శించారు. సమాజంలో జరుగుతున్న అవినీతి అక్రమాలను జర్నలిస్టులు వెలికి తీయాలన్నారు. ప్రజల సమస్యలను ప్రభుత్వం అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించడం గొప్ప విషయం అన్నారు. అందరి కష్ట సుఖాలు రాసే జర్నలిస్టుల సమస్యలను ఎవరు ఏనాడూ పట్టించుకోరన్నారు. దేశ అంతర్గత విషయాలలో జరుగుతున్న అక్రమాలను వెలికితీస్తున్న కలం వీరులు నేటి సమాజానికి ఎంతో అవసరం అన్నారు. ఈ ఆర్ ఫౌండేషన్ ద్వారా విద్య, వైద్య రంగాలలో తన తండ్రి ఈరవత్రి రాందాస్ పేరుపై సేవా కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు తాను కిందిస్థాయి నుంచి కష్టపడి వచ్చినందున ప్రతి ఒక్కరి బాధ తెలుస్తుందని వివరించారు. ఒక విద్యావంతుడు ప్రజా ప్రతినిధి అయితే పేద మధ్యతరగతి ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. డబ్బు అనేది శాశ్వతం కాదని, ప్రేమాభిమానాలే శాశ్వతం అన్నారు. పాకిస్తాన్ పై దాడి చేసిన వివిధ దళాల సైనికులకు వందనం అన్నారు. ఇందులో ఫౌండేషన్ సభ్యులు రాంప్రసాద్, కొండి రామచందర్, బాల్కొండ మాజీ జెడ్పిటిసి సభ్యుడు వెంకటేష్, దోమల శ్రీనివాస్, నిట్ శేఖర్, నూకల శేఖర్, క్రాంతి, చెన్న చందు హాజరయ్యారు. జర్నలిస్టులకు ప్రమాద భీమా చేయించడం అభినందనీయం..ఆర్మూర్ లోని నవనాథపురం ప్రెస్ క్లబ్ లోని సభ్యులందరికీ రూ 20 లక్షల చొప్పున ప్రమాద బీమా చేయించిన ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్, చార్టెడ్ అకౌంటెంట్ ఈరవత్రి రాజశేఖర్ అభినందనీయమని నవనాథపురం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మంచిర్యాల నరేందర్ అన్నారు. వార్త సేకరణ కోసం రాత్రింబవళ్లు తిరిగే జర్నలిస్టుల శ్రేయస్సును కోరి పెద్ద మనసుతో ప్రమాద బీమా ఇన్సూరెన్స్ ను చేయించారన్నారు. అంతకుముందు చైర్మన్ పుష్పగుచ్చమిచ్చి శాలువాతో ఘనంగా సన్మానం చేశారు. జర్నలిస్టుల ప్రమాద బీమా చెక్కులను క్లబ్ అధ్యక్షుడు నరేందర్ కు రాజశేఖర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో టి యు డబ్ల్యూ జే ఐజేయు జిల్లా ఉపాధ్యక్షుడు పార్దేం సంజీవ్, ఉపాధ్యక్షుడు ముద్రకోలా వినోద్, కోశాధికారి గోజూరు మహిపాల్, సంయుక్త కార్యదర్శి దినేష్, సాంస్కృతిక కార్యదర్శి సూరిబాబు, సభ్యులు సార్ పుతే శ్రీనివాస్, విన్సెంట్, ఖోడే మనోహర్, గోలి పురుషోత్తం, చరణ్ గౌడ్, షికారి శ్రీనివాస్, సామ సురేష్, బారడ్ గణేష్, గట్ల వినోద్, గట్టడి అరుణ్, పోహర్ కిరణ్ చిరంజీవి, నితేష్ తదితరులు పాల్గొన్నారు.