ఆర్మూర్ మండలం పిప్రి గ్రామంలో నిజామాబాద్ పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో గ్రామస్తులకు పలు విషయాలపై అవగాహన కల్పించారు. పట్టణ సీఐ సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఆన్లైన్ మోసాలు, విదేశీ ఉద్యోగాలపై జాగ్రత్తలు, నకిలీ ఏజెంట్లు నిరుద్యోగులను మోసం చేసిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రోడ్డు భద్రతా పై అవగాహన, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలు పాటించాలని ద్విచక్ర రహదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. మహిళలు అసౌకర్యానికి గురైనప్పుడు షీ టీమ్ నెంబర్ 8712659795 లేదా డయల్ 100 కు కాల్ చేయాలని, మొబైల్ పోగొట్టుకున్నప్పుడు CEIR హోటల్ ద్వారా రికవరీ చేయించుకోవచ్చని, అంద విశ్వాసాల పై అవగాహన కల్పించారు. మాదకద్రవ్యాల పై అవగాహన, యువత మాదకద్రవ్యాల నుంచి దూరంగా ఉండాలని సూచించారు. అందరూ అన్నదమ్ముల్లా శాంతియుతంగా కలిసిమెలిసి ఉండాలని, సమాజంలో జరుగుతున్న నేరాలు, చట్టాలపై పోలీసులు గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కళాబృందం సభ్యులు, షీ టీం సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.