ఆర్మూర్ & ఇతర మండలాల్లో జరిగిన వరుస చైన్ స్నాచింగ్ కేసులలో నిందితులను అరెస్టు చేసినట్లు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య వెల్లడించారు. గురువారం ఆర్మూర్ పోలీస్ స్టేషన్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. నేడు వీరు రెండు బైకులపై మళ్ళీ దొంగతనం చేయడానికి ఆర్మూరు వైపునకు వస్తున్నగా ఆర్మూర్ మండలం పెర్కిట్ బైపాస్ దగ్గర వాహనాల తనిఖీ చేసిన ఆర్మూర్ పోలీసులు వీరిని పట్టుకొని విచారించగా వీరు చేసిన దొంగతనాలను ఒప్పుకోవడం జరిగిందని తెలిపారు. కేసును చేదించిన అధికారులను పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అభినందించారు. అనుమానస్పదంగా ఎవరైనా కనపడితే పోలీసులకు సమాచారం అందించాలని, ఎంత త్వరగా సమాచారం అందిస్తే అంత మేలని చెప్పారు. మీ ఏరియాలో, మీకు తెలిసిన ఏరియాలలో అనుమానాస్పదంగా కనబడితే పోలీసులకు సమాచారం తెలియజేయాలన్నారు. ఈ మీడియా సమావేశంలో ACP వెంకటేశ్వర్ రెడ్డి, పట్టణ సీఐ సత్యనారాయణ గౌడ్, రూరల్ సీఐ శ్రీధర్ రెడ్డి, తదితరులు ఉన్నారు.