ఆర్మూర్ పట్టణంలో పోస్ట్ ఆఫీస్ వద్ద కోతులు వెంబడిస్తున్న జాతీయ పక్షి నెమలిని బిజెపి నాయకులు పోల్కం వేణు, లక్ష్మీనారాయణ, కర్తన్ మోహన్ లు కాపాడి ఫారెస్ట్ అధికారులకు అప్పగించారు. పోల్కం వేణు మాట్లాడుతూ జాతీయ పక్షి నెమలిని ఆర్మూర్ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లామని, అటవి శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు పోలీస్ స్టేషన్ కు వచ్చి నెమలిని తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్, పోలీస్ శాఖల అధికారులు పాల్గొన్నారు.