
ఇందిరమ్మ ఇండ్లను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని ఆర్మూర్ MPDO బ్రహ్మానందం అన్నారు. శుక్రవారం ఆయన ఆర్మూర్ పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఇందిరమ్మ ఇండ్ల కోసం మండలంలో 539 దరఖాస్తులు వచ్చాయన్నారు. అందులో 378 అర్హులను గుర్తించి ప్రకటించినట్లు చెప్పారు. నివేదికను కలెక్టర్ కార్యాలయానికి కూడా పంపించామన్నారు. అనంతరం కలెక్టర్ గ్రామాల వారిగా మంజూరు ఇచ్చారని చెప్పారు. గ్రామాల వారిగా పారిశుద్ధంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నామని తెలిపారు. అదేవిధంగా రాజీవ్ యువ వికాస్ పథకానికి 1568 అప్లికేషన్లు ఆన్లైన్ ద్వారా వచ్చాయని, వెరిఫికేషన్ కూడా చేశామని కొన్ని డాక్యుమెంట్లు సరిగా లేకపోవడంతో 1418 దరఖాస్తులను బ్యాంకు వారికి పంపించడం జరిగిందని తెలిపారు. మిగిలిన వారి దరఖాస్తులను పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించి తదుపరి ప్రక్రియ చేపడతామన్నారు.