
ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం ఆర్మూర్ పట్టణంలో వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థులు RDO కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేసి RDO రాజాగౌడ్ కు వినతిపత్రం అందజేశారు. అనంతరం PDSU జిల్లా అధ్యక్షుడు నరేందర్, USFI నాగరాజు, PDSU డివిజన్ అధ్యక్షుడు అనిల్ మాట్లాడుతూ సకాలంలో ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల కాకపోవడం వల్ల విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో క్షత్రియ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.