JEE (అడ్వాన్స్ ) – 2025 లోని జిల్లాలోని రెండు పరీక్ష కేంద్రాల కోసం తేది: 18-05-2025 నాడు ఉదయం 7:00 గంటల నుండి సాయంత్రం 7:00 గంటల వరకు పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా నిజామాబాదు పోలీస్ కమీషనర్ పి. సాయి చైతన్య, IPS., నిషేధిత ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కావున నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా నిరోధించాలనే ఉద్దేశ్యంతో నిజామాబాదు పోలీస్ కమీషనర్ పి. సాయి చైతన్య, IPS., అండర్ సెక్షన్ 163 BNSS అమలులో ఉంటుందని తెలియజేశారు.
*అండర్ సెక్షన్ 163 BNSS ప్రకారం*
1) ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు పరీక్ష కేంద్రాల వద్ద గుమి కూడరాదు.
2) నిషేదిత వస్తువులతో పరీక్ష కేంద్రాల వద్ద తిరుగవద్దు.
3) అన్ని పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాలలోని అన్ని జిరాక్స్ సెంటర్లను 18-05-2025 (ఉదయం 07.00 నుండి సాయంత్రం 7:00 గంటల వరకు) మూసివేయాలి.
పై నిషేధిత ఉత్తర్వులు 18-05-2025 (ఉదయం 08:00 నుండి సాయంత్రం 6:00 వరకు) అమలులో ఉంటాయి