బేకరీలు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల నిర్వాహకులు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని మున్సిపల్ అధికారులు సూచించారు. శుక్రవారం ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ రాజు ఆదేశాల మేరకు శానిటరీ ఇన్స్పెక్టర్ గజానంద్, పర్యావరణ ఇంజనీర్ పూర్ణమౌళి పలు బేకరీలు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో తనిఖీలు నిర్వహించారు. పరిశుభ్రత, సింగిల్ యూజ్ పై తనిఖీలు చేపట్టామన్నారు. ఈ తనిఖీలలో సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.