
ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని ఆర్మూర్ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నికలు మే 20వ తేదీన నిర్వహిస్తున్నామని ఎలక్షన్ కమిటీ సభ్యులు టీవీ5 రిపోర్టర్ రాజేశ్వర్ గౌడ్, ప్రజా శంఖారావం సీఈఓ పుట్టి మురళి లు తెలిపారు. శనివారం రోజు పట్టణంలోని ప్రెస్ క్లబ్ భవనంలో క్లబ్ సభ్యులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ నెల 20వ తేదీన జరిగే ఆర్మూర్ ప్రెస్ క్లబ్ ఎన్నికలకు ఆర్మూర్ ప్రెస్ క్లబ్ సభ్యులందరూ తప్పనిసరిగా హాజరై నూతన కార్యవర్గ సభ్యులను ఎన్నుకోవాలని కోరారు. మాజీ అధ్యక్ష కార్యదర్శులు సమావేశం అనంతరం నూతన కార్యవర్గ ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి ఉన్నవారు వచ్చి తమ నామినేషన్లను ముందుగా అందజేయాలన్నారు. ఈ సమావేశంలో మాజీ అధ్యక్షులు నెమలి ప్రశాంత్, కార్యదర్శి సురేందర్ గౌడ్, కోశాధికారి గంగుల పద్మారావు, సభ్యులు పింజ సుదర్శన్, కలిగోట చిన్న, జనగౌడ్, యాఫై, రాజేష్, చేతన్, హరికృష్ణ, చక్రి, అనీఫ్, తదితరులు పాల్గొన్నారు.