
అరులైన పేదలకే ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని ఆర్మూర్ మండలం ఫతేపూర్ గ్రామంలో బాధితులు నిరసన కార్యక్రమం చేపట్టారు. వీరికి ఎంఆర్పిఎస్ నాయకులు రాము తమ మద్దతు తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ అన్నీ ఉన్న వారికే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ దిక్కులేని నిరుపేదలకు అన్యాయం చేస్తున్నారని వారు అధికారులను ప్రశ్నించారు. ఇల్లు కూలిపోయే స్థితిలో, దీనస్థితిలో ఉన్నవారికి ఇందిరమ్మ ఇండ్లు వచ్చేలా అధికారులు కృషి చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.