
సిరికొండ మండలం పెద్ద వాల్గొట్ గ్రామంలో సిరికొండ ఎస్సై ఎల్ రామ్ ఆధ్వర్యంలో గ్రామంలోని యువతతో ర్యాలీ నిర్వహించి పలు విషయాలపై అవగాహన కల్పించారు. ప్రస్తుతం వేసవికాలం ఉండడంతో ప్రజలు ఇంటికి తాళం వేయకుండా ఆరు బయట నిద్రించడం వలన జరుగుతున్న దొంగతనాలను వివరించారు. సీసీ కెమెరాల ప్రాముఖ్యత వివరిస్తూ గ్రామాలలో ప్రధాన కూడళ్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ముఖ్యంగా యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని మత్తు పదార్థాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.