
ఆర్మూర్ పట్టణంలోని కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్ ప్రతినిధులతో జిల్లా DLSA సెక్రటరీ సీనియర్ సివిల్ న్యాయమూర్తి ఉదయభాస్కర్ రావు మీడియేషన్ సెంటర్ ద్వారా బాధితులకు కౌన్సిలింగ్ జరుగుతున్న నేపథ్యంలో వాటి గురించి ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మీడియేషన్ సెంటర్ ద్వారా ఎలాంటి డబ్బులు సమయం వృధా కాకుండా బాధితులకు తగిన న్యాయం మేలు జరుగుతుందని అన్నారు. అదేవిధంగా ఎవరికైనా సమస్యలు వస్తే మీడియేషన్ ప్రతినిధులను నేరుగా కలిసి వారి ద్వారా సులువుగా పరిష్కరించుకోవచ్చు అని తెలిపారు. అనంతరం మీడియేషన్ సభ్యులు బాబా గౌడ్, లయన్ నివేదన్ గుజరాతి MJF, అశోక్ ఫాథర్, నారాయణ వర్మ లు న్యాయమూర్తికి శాలువాతో సన్మానించి ఆత్మీయ శుభాకాంక్షలు తెలిపారు.