
ఆర్మూర్ మహాత్మ స్వచ్ఛంద సేవా సంస్థ చేస్తున్న సేవలు అభినందనీయమని మాజీ ఆర్మూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ మోత్కూరి లింగాగౌడ్ అన్నారు. “ఆర్మూర్ మహాత్మ స్వచ్ఛంద సంస్థ” ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలోని హౌజింగ్ బోర్డు కాలనీలో గల హనుమాన్ ఆలయ ఆవరణలో స్వచ్ఛ ఆర్మూర్ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సేవ సంస్థ చేస్తున్న సేవలు అభినంనీయమని, ఇట్టి సేవలు మరింత విస్తరించి ఆర్మూర్‌ను స్వచ్ఛ ఆర్మూర్‌గా తీర్చిదిద్దాలన్నారు. సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సుంకె శ్రీనివాస్ మాట్లాడుతూ స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం ఒక గంట నినాదంతో ఇట్టి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా ఈ రోజున హౌజింగ్ బోర్డు కాలనీలో గల హనుమాన్ ఆలయ ఆవరణలో స్వచ్ఛ ఆర్మూర్ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. మా సంస్థ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు, కాలని వాసుల సహకారంతో ఇట్టి కార్యక్రమాన్ని విజయంతంగా పూర్తి చేశామన్నారు. ఆలయం చుట్టు ఉన్న చెత్త చెదారాన్ని, ఆలయ ఆవరణలో పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించామన్నారు. ఈ కార్యక్రమంలో కాలని అధ్యక్షులు వేముల ప్రకాష్, కాలనీ వాసులు ఆత్మచరణ్, శ్రీరామోజి దశరథ్, ఆనంద్, పురుషోత్తం, స్వచ్ఛంద సంస్థ సభ్యులు ప్రశాంత్, సుంకె నిశాంత్, గుర్రం రాకేష్, రాజ్ కుమార్, సాయి కిరణ్, బోజన్న, మధుసుధన్, కృషివర్ధన్, పెద్ద గంగారాం కాలని వాసులు తదితరులు పాల్గొన్నారు.