
రాబోయే వర్షాకాలన్ని దృష్టిలో ఉంచుకొని ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు మున్సిపల్ కమిషనర్ రాజును కోరారు. ఆదివారం వారు మీడియాతో మాట్లాడారు. ఇంతకుముందు మున్సిపల్ వారు తవ్విన డ్రైనేజీని యధాస్థితికి తీసుకురావాలన్నారు. వర్షాకాలంలో కాలనీవాసులు ఇబ్బందులు ఎదుర్కోకుండా చూడాలన్నారు. మున్సిపల్ కమిషనర్ తక్షణమే చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.