
భారతీయ భాగ్యనగర అర్చక సంఘం అధ్యక్షుడు గట్టు శ్రీనివాస్ చార్యులు ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా జోషి శ్రీనాథ్ ముచుకురు గ్రామ పురోహితులను నియమించినట్లు జోషి శ్రీనాథ్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఈనెల ధూప దీప నైవేద్యం పథకంలో అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ప్రతి ఒక్క అర్చకునికి అందుబాటులో ఉండి సహాయ సహకారాలు అందిస్తామని వారు తెలిపారు.